దక్షిణ కోస్తా రైల్వే, ఎన్డీఆరఎఫ్ సంయుక్తంగా మాక్ డ్రిల్
అక్షర కిరణం, (తాడిపత్రి): వాస్తవ రైలు ప్రమాదాన్ని అంచనా వేయడానికి, వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి, అత్యవసర సహాయక చర్యల ప్రభావాన్ని మూల్యాంకనం చేయడానికి, దక్షిణ తీర రైల్వే, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆరఎఫ్) అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సహకారంతో గుంతకల్ డివిజన్లోని తాడిపత్రి రైల్వే స్టేషన్లో ఒక సమగ్ర మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.
ఈ మాక్ డ్రిల్‌ను గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర శేఖర్ గుప్తా నేతృత్వంలో నిర్వహించారు. ఈ డ్రిల్‌లో, చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న రైలు నంబర్ 07403, ఉదయం సుమారు 8:30 గంటలకు తాడిపత్రి యార్డ్ వద్ద పట్టాలు తప్పి, S1, ణ2 అనే రెండు కోచ్‌లు బోల్తా పడిన పరిస్థితిని అనుకరించారు.
అనుకరణ అత్యవసర పరిస్థితిలో భాగంగా, ముగ్గురు ప్రయాణి కులు మరణించినట్లు, 16 మంది తీవ్రంగా గాయపడినట్లు, ఆరుగురు స్వల్పంగా గాయపడినట్లు నివేదించారు. క్లిష్ట పరిస్థితు లలో సహాయక చర్యలు, అత్యవసర వైద్య స్పందన, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ప్రయాణికులకు సహాయం అందించడంలో గల వేగాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు.
ఈ అనుకరణ సంఘటన జరిగిన వెంటనే, రైల్వే అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆరఎఫ్), స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు ప్రారంభిం చారు. సహాయక, వైద్య సహాయం, పునరుద్ధరణ ప్రక్రియలను ప్రదర్శించడానికి రైల్వే వైద్య, యాంత్రిక, భద్రతా, ఇతర విభాగాల బృందాలను వేగంగా రంగంలోకి దించారు. డిప్యూటీ కమాండెంట్ అఖిలేష్ చౌబే నేతృత్వంలోని ఎన్డీఆరఎఫ్ 10వ బెటాలియన్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సన్నిహితంగా కలిసి పనిచేస్తూ, డీఆరఎం చంద్రశేఖర్ గుప్తా, ఏడీఆరఎం, గుంతకల్ డివిజన్ బ్రాంచ్ అధికారులతో ఈ విన్యాసాన్ని సమన్వయం చేశారు.
ఏదైనా ఊహించని రైల్వే అత్యవసర పరిస్థితిలో సత్వర, సమర్థవంత మైన, సుసంఘటిత ప్రతిస్పందనను నిర్ధారించడానికి, ప్రస్తుత విపత్తు నిర్వహణ ప్రణాళికల సమర్థతను అంచనా వేయడానికి, మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించడానికి, పాల్గొనే అన్ని సంస్థ ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ మాక్ డ్రిల్ ఒక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.