ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు
î17న తుఫాన్‌గా 18 అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
అక్షర కిరణం, (విశాఖపట్నం): బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ వాయుగుండం తీవ్రత పెరిగి ఉత్తర-వాయవ్య దిశగా కదిలే అవకాశ ముందని అంచనా వేస్తుననారు. ఈ అక్వాన్ తుఫాన్ మరింత బలపడి ఈనెల 17న తుఫాన్‌గా, 18న అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో 19 అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాంధ్రలోనే అతి తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 960 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ చెన్నైకి 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు తుఫాన్‌గా మారి.. ఈ నెల 17న ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు తీవ్ర తుఫాన్‌గా కొనసాగనుంది. తర్వాత మరింత బలపడి 18 రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారి 19న ఉదయం వరకు కొనసాగనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారా ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల ఈ నెల 20 వరకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర అంతటా అత్యంత భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటు న్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.