విషమిస్తోన్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం
Åఏమాత్రం స్పందించని కేంద్ర ప్రభుత్వం
అక్షరకిరణం, (ఢిల్లీ/జాతీయం): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. 18 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ఆయన దీక్ష విరమిం చాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరడం, ఆయన ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. ప్రతి ప్రాణం విలువైందేనన్న న్యాయస్థానం.. ఆయన్ను కాపాడటానికి వైద్య సాయం అందించాలని కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.
ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ కు స్వీకరించిది. ‘మిస్టర్ మెహతా ఆయన ఆరోగ్యాన్ని మాని టర్ చేయడానికి ఏదైనా మెకానిజం ఉందా?’ అని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వర్చువల్‌గా విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను బెంచ్ ప్రశ్నించింది.
వాంగ్చుక్కు డాక్టర్లు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తు న్నారని.. ఆయన హెల్త్ పారామీటర్లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారని మెహతా కోర్టుకు సమాధానం ఇచ్చారు.
వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమిస్తోందని.. ఆయన శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిం చారు. నిరాహార దీక్షను ప్రారంభించిన నాటి నుంచి వాంగ్‌చుక్ 9 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్ ఇచ్చిన డాక్టర్ సతీష్ లాంబా మాట్లాడుతూ.. ‘సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పటికైతే మానసి కంగా చురుగ్గా, వైద్యపరంగా నిలకడగా ఉన్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో నిశితంగా గమనిస్తున్నాం’ అని చెప్పారు.
‘ఇవాళ ఆయన నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. ఆయన ఇప్పటి దాకా 9 కిలోలకుపైగా బరువు తగ్గారు. ఆయన బ్లడ్ షుగర్ 80 ఎంజీ/డీఎల్, పల్స్ నిమిషానికి 72గా ఉంది. ఆయన బీపీ పడుకొని ఉన్నప్పుడు 105/61గా, కూర్చున్నప్పుడు 101/65గా ఉంది. ఆయన శరీరంలో నీటి శాతం సాధారణంగానే ఉంది. ఆయన మానసికంగా చురుగ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు 56.9 కిలోలు’ అని లాంబా తెలిపారు.
‘వాంగ్చుక్కు రెండో దశలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయి. కండరాలు క్షీణించి, కరుగుతున్నాయి. దీని వల్లే రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం పెరిగింది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉన్న మూడో దశను వాంగ్‌చుక్ ఎదుర్కొంటున్నారు. ఈ దశలో ఆయన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మేం నిరంతరం ఆయన ఆరోగా?్యన్ని పర్యవేక్షిస్తున్నాం’ అని లాంబా తెలిపారు. ఢిల్లీ కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. తన పరిస్థితి అంతగా బాగోలేదని.. అలాగనీ అంత దారుణంగా కూడా ఏమీ లేదన్నారు. ఎక్స్‌లో వీడియోను షేర్ చేసిన వాంగ్‌చుక్.. నిరాహార దీక్ష విరమించాలని తనకు సూచించడానికి బదులు.. జులై 20న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని ప్రజలను కోరారు. ‘నేను దీక్ష విరమిస్తే ఏం మారుతుంది..? దాని వల్ల ఎలాంటి సందేశం జనాల్లోకి వెళ్తుంది? జవాబుదారీతనం అవసరం లేదనే సందేశమే ప్రభుత్వానికి అందుతుంది. జనం ఆందోళనకు దిగుతారు, వాళ్లే విరమిస్తారని సర్కారు అనుకుంటుంది’ అని వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు.