వైభవంగా ప్రారంభమైన సింహాచలం గిరిప్రదక్షిణ
Åభారీగా తరలివచ్చిన భక్తులుÅగిరి ప్రదక్షిణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, జీవీఎంసీ
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం శ్రీ వరహా లక్ష్మి నృసింహ స్వామి కొలువై ఉన్న సింహాచలం గిరి ప్రదక్షిణ మంగళ వారం వైభవంగా ప్రారంభమైంది భక్తులు భారీ సంఖ్యలో సింహాద్రి నాథుడు వెలసిన సింహగిరి చుట్టూ 32 కిలో మీటర్లను కాలి నడకన తిరిగి ప్రదక్షిణ చేశారు. వెంకోజీపాలెం, ఎనఏడీ కొత్తరోడ్డు, వెంకటాపురం, సింహాచలం తదితర మార్గాల్లో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారి పుష్పరథంతో గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో గిరి ప్రదక్షిణ మార్గమంతా సింహాద్రినాథుడి నామాస్మరణతో మారు మోగింది. తొలి పావంచా ప్రాంతం రద్దీగా మారింది. గిరి ప్రదక్షిణను పరుస్కరించుకుని భక్తుల కోసం జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా స్వామివారు కొలువై ఉన్న మండపాన్ని అధికారులు పూలతో విశేష అలంకరణ చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తుల దైవనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.