నోయిడా డీఎమ్, అధికారుల జీతాల నుంచే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలి
Åఅలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు Åఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె తీరుపై కోర్టు ఆగ్రహం
Åఆకృతి చౌదరిపై ఎనఎసఏ నిర్బంధాన్ని కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిపై విధించిన జాతీయ భద్రతా చట్టం (ఎనఎసఏ) నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈసందర్భంగా నోయిడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం), జాతీయ ఎన్నికల కమిషనర్ కుమార్తె మేథా రూపం ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం, అధికారుల ఏకపక్ష వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులను వెలువరించింది. డీఎం జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులు, దానికి చూపిన కారణాలు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా, విచక్షణా రహితంగా జారీ చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఇది భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కును స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే డీఎం మేథా రూపం సహా అధికారుల జీతాల్లోంచి డబ్బును తీసి బాధితురాలికి నష ్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
2026 ఏప్రిల్‌లో జరిగిన నోయిడా కార్మికుల నిరసనలకు సంబంధించి ఆకృతి చౌదరితోపాటు మరొక కార్యకర్త సత్యం వర్మపై కూడా ఎనఎసఏ ప్రయోగించి అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. జాతీయ భద్రతా చట్టం అనేది ఒక మినహాయింపు మాత్రమేనని, దానిని సాధారణ నేర చట్టాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించ áకూడదని హితవు పలికింది. పోలీసులు చూపిన అరెస్టు ఆధారాలు ఊహాజనితమైనవని, కేవలం అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఉన్నాయని, ఆ అభిప్రాయాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు గానీ సామగ్రి గానీ లేవని హైకోర్టు స్పష్టం చేసింది.
అధికారుల జీతాల నుంచే రూ.5 లక్షల నష్టపరిహారం రికవరీ
ఈక్రమంలోనే అధికారుల పరిపాలనా అతిక్రమణలు ఉత్తరప్రదేశ్‌ను ఒక భయానకమైన స్వేచ్ఛ లేని సమాజంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ.. బాధితురాలికి ఆకృతి చౌదరి పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈపరిహారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా బాధ్యులైన గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఇతర సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి ఎస్హెచఓ (ఎస్హెచఓ) వరకు ఉన్న సిబ్బంది సొంత జీతాల నుంచి వ్యక్తిగతంగా వసూలు చేయాలని తీర్పు ఇచ్చింది. పౌర హక్కులకు భంగం కలిగించే అక్రమ చర్యల ను సరిదిద్దేటప్పుడు బాధితులకు తగిన పరిహారం అందిం చడానికి న్యాయవ్యవస్థ ఇలాంటి కఠిన ఉత్తర్వులను జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
డీఎమ్ మేథా రూపం వైఖరిపై తీవ్ర ఆగ్రహం
ఈ కేసులో గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేధా రూపమ్ (జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ కుమార్తె) ప్రవర్తన అత్యంత హేయమైనదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎనఎసఏ వంటి అత్యంత కఠినమైన చట్టాన్ని ప్రయోగించే ముందు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రికార్డులను సమగ్రంగా, కూలంకషంగా పరిశీలించాల్సి ఉందని గుర్తు చేసింది. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని ఒక మహిళా విద్యార్థినిని భయభ్రాంతులకు గురిచేయడానికి డీఎం ప్రయత్నించారని, కార్మికులకు మద్దతుగా బహిరంగ ప్రదేశా లలో భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించే ఇతరులను భయపెట్టేందుకే ‘ఒక ఉదాహరణగా’ ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోందని కోర్టు అభిప్రాయపడింది.