ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆశావర్కర్ల పోస్టుల భర్తీ చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయగా.. తాజా గా మరో 913 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినట్లు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా ఈ నియామకాల ప్రక్రియను మొదలుపెడతామన్నారు. ఈ పోస్టులకు సంబంధించి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుకు చెందిన మహిళల్లో 10వ తరగతి పాసై ఉండాలి. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఆశావర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.10,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తారు. ఈజీతంలో.. రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలింది కేంద్రం అందిస్తుంది.
ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతున్న 913 ఆశా వర్కర్ల పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 673, గిరిజన ప్రాంతాల్లో 64, పట్టణ ప్రాంతా ల్లో 176 పోస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈనెల 30నాటికి నియామకాల జాబితా ను పంపించాలని జిల్లాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెలాఖరు నాటికి ఈ నియామక ప్రక్రియ ముగుస్తుంది. జిల్లాలవారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి.. అనకాపల్లి జిల్లాలో 77, కర్నూలు జిల్లాలో 65, తూర్పుగోదావరి జిల్లాలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యం జిల్లాలో 43, పశ్చిమగోదావరి జిల్లాలో 42, అన్నమయ్య జిల్లాలో 41, ప్రకాశం జిల్లాలో 38, కడప జిల్లాలో 38, కృష్ణా జిల్లాలో 37, విశాఖపట్నం జిల్లాలో 33, చిత్తూరు జిల్లాలో 32, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 32, పల్నాడు జిల్లాలో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్పీఎసఆర్ నెల్లూరులో 29, ఏలూరు జిల్లాలో 27, అనంతపురం జిల్లాలో 26, మార్కాపురం జిల్లాలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 21, నంద్యాల జిల్లాలో 21, పోలవరం జిల్లాలో 21, తిరుపతి జిల్లాలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్ల జిల్లాలో 7 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచి స్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆశావర్కర్ల పోస్టుల భర్తీకి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ప్రాథమిక ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.