మరమ్మతుల కారణంగా పలు మెమో రైళ్లు రద్దు
అక్షర కిరణం, (అమరావతి): రైల్వేశాఖ మరమ్మతుల కారణంగా కొన్ని మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నాయుడుపేట స్వర్ణ ముఖి నది వంతనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ కారణంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వచ్చే మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ రైళ్లను రద్దు చేయడం, ఆ ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతుండ డంతో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రద్దయిన మెమో రైళ్లు చెన్నై - సూళ్లూరుపేట నడవనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నడిచే కొన్ని మెమో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నాయుడుపేట స్వర్ణముఖి నది వంతెనపై మరమ్మతుల కారణంగా పలు మెమో రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణంతో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రెండు రోజులుగా పలు మెమో రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. గురువారం కూడా ఈ రైళు రద్దు కానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. నాయుడుపేట స్వర్ణముఖి నదిపై ఉన్న వంతెన మార్గంలో ఇనుప గడ్డర్ల స్థానంలో సిమెంట్ గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. పది రోజులుగా ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మంగళవారం సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం 8:05 గంటలకు, 10 గంటలకు వచ్చే మెమో రైళ్లు.. అలాగే నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 10:20, సాయంత్రం 4:00 గంటలకు వచ్చే మెమో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
రద్దు చేసిన మెమో రైళ్లను చెన్నై - సూళ్లూరుపేట మధ్య నడిచేలా రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మెమో రైళ్లను రద్దు చేయడంతో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గురువారం కూడా ఈ రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మెమో రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు రద్దుకావడం బస్సు సౌకర్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్లే పలు బస్సులను కొంతకాలంగా నిలపివేయడంతో ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.