మెరైన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయండి
Åకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత భద్రతకు ఒక కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మెరైన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లా డుతూ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 193 కిలో మీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉందని, ఇందులో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో తీర ప్రాంతంలో 3 మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 172 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయ న్నారు. తీర ప్రాంత పోలీసు స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ కావాలని మెరైన్ పోలీసులు కలెక్టర్‌ను కోరగా ఫెన్సింగ్ వేయమని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు తెలియజేస్తామన్నారు. మోటరైజ్డ్ బోట్లు 1636 ఉండగా ఇందులో ఇన్స్టాల్ చేసిన బోట్లు 607 ఉన్నాయన్నారు. ఒక్కో బోటు ఖరీదు 30,500 రూపాయలని పేర్కొన్నారు. మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు ఇంట ర్నెట్ సౌకర్యం అవసరం అవుతుందని మెరైన్ పోలీసు అధికా రులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తీర ప్రాంత ప్రజలకు, బీచ్‌లకు వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత, ఎనఐసీ ఉప సంచాలకులు కిరణ్ కుమార్, విపత్తుల నిర్వ హణ సంస్థ అధికారి రాము, మెరైన్ డిఎస్పీ, విశాఖపట్నం ఎస్.కిరణ్ కుమార్, బారువా, బావనపాడు, కళింగపట్నం సీఐలు రమేష్, డి.రాము, ప్రసాదరావు పాల్గొన్నారు.