ఏపీలో వార్డెన్ల ప్రమోషన్లకు సర్వీస్ రూల్స్
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ ప్రభుత్వం గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త చెప్పింది. ప్రమోషన్లకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సర్వీస్ రూల్స్ సడలిం చాలని గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు కోరుతుండగా.. మొత్తానికి ఉపశమనం లభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రేడ్-2 బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త చెప్పింది. బీసీ సంక్షేమశాఖ పరిధిలోని గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లకు పదోన్నతులు కల్పించేందుకు సర్వీస్ రూల్స్‌ను ప్రకటించారు. దాదాపు 300 మందికిపైగా వార్డెన్లకు ప్రమోషన్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. ఏపీపీఎస్సీ ద్వారా గ్రేడ్-2 వసతి గృహ వార్డెన్లను నియమించగా.. వీరి పదోన్నతులకు సంబంధించి సర్వీస్ రూల్స్ లేవు. 2008 నుంచి వార్డెన్లు ప్రభుత్వాలకు ప్రమోషన్ల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి సవిత వార్డెన్ల ప్రమోషన్ల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి.. పదోన్నతులకు ఓకే చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సర్వీస్ రూల్స్‌ను రూపకల్పన చేస్తూ మెమో జారీ అయ్యింది. ఈ మేరకు సర్వీస్ నిబంధనల రూపకల్ప చేయడంతో వార్డెన్లకు భవిష్యత్తులో గ్రేడ్-1 వార్డెన్లుగా ప్రమోషన్లు దక్కు తాయి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సీనియార్టీని పరి గణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పిస్తారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై గ్రేడ్-2 వసతి గృహ వార్డెన్లు హర్షం వ్యక్తం చేశారు.. అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఈ సమస్య పరిష్కారం కావడానికి కృషిచేసిన మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం అప్డేట్స్
ఏపీపీఎస్సీ పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లెక్చరర్లు (ఎకన మిక్స్) ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ మేరకు వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టులకు సంబంధించి హైకోర్టు తీర్పుతో ఈ నెల 20న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు చెప్పారు. డిప్యూటీఈవోలకు సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన వెంటనే అదే రోజు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ పరీక్ష నిర్వహించ నున్నట్లు తెలిపారు.
ఏపీలో వీబీ జీరాంజీ పథఖం ప్రారంభమైన తర్వాత రెండు వారాలకు శ్రామికులకు సంబంధించిన వేతనాల చెల్లింపుల్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా 72 మంది శ్రామికులకు మొత్తం రూ.57 వేలు చెల్లించారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మిగిలిన లక్షలాది మంది శ్రామికులకు దశల వారీగా వేతనాలు చెల్లిస్తారు.