సీతాన గార్డెన్స్ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో ఈనెల 22 నుంచి కనకదుర్గాదేవి శరన్నవరాత్రులు మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి క్షీరాభిషేకం, గణపతి హోమం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 5000 మందికి అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు కీర్తి తెలిపారు. అదే విధం గా ప్రతినెల పౌర్ణమి రోజున గాయత్రి దేవి అమ్మవారికి ఉదయం నుంచి క్షీరాభిషేకం భక్తుల స్వహస్తాలతో నిర్వహి స్తామని తెలిపారు. భక్తులు పెద్దఎత్తున శరన్నవరాత్రి మహో త్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్త సనపల కీర్తి కోరారు.