కంటైనర్ లారీ ఢీకొని సచివాలయం ఉద్యోగి మృతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విధి నిర్వహణలో భాగంగా నగరంలోనికి వెళ్తున్న సచివాలయం ఉద్యోగి సేతు నరేంద్ర అరుణ్ కుమార్(32) భారీ కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వడ్లపూడి సచివాలయంలో ఎమినిటీస్ కార్య దర్శిగా పనిచేస్తున్న బేత నరేంద్రఅరుణ్ కుమార్(32) తండ్రి అప్పారావుతో కలిసి గాజువాక 100 అడుగుల రహదారిలో కుంచుమాంబ కాలనీలో నివాసముంటు న్నాడు. రోజువారి వీధుల్లో భాగంగానే బుధవారం ఉదయం వడ్లపూడిలో గల సచివాలయానికి వెళ్లారు. ప్రస్తుతం సర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం విధుల్లో భాగంగా గాజువాక మీదుగా ఎనఏడీ కొత్త రోడ్డు జాతీయ రహదారి మీదుగా నగరంలోకి వెళుతున్న క్రమంలో ఆర్ అండ్ బి జంక్షన్ దాటిన తర్వాత కంటైనర్ లారీ ఢీకొట్టి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, ఎయిర్ పోర్టు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.