విద్యుత్ పొదుపు భావితరాల భవిష్యత్తుకు మదపు
కట్రాన్స్కో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి
అక్షర కిరణం, (శ్రీకాకుళం): రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని తీసుకు వచ్చిందని,ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. పీఎం నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 15న దేశంలో గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ ఇంజినీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి చెప్పారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యగర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ భారం నుండి ఉపశమనం పొందడానికి పీఎం సూర్యగర్ పథకం ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ముందుగా కోటి కు టుంబాలకు 75 వేల కోట్ల రూపాయలతో సౌరశక్తి విద్యుత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టారని స్పష్టంచేశారు. దీనికోసం ఒక నోడల్ అధికా రిని నియమించామని ఆయన పేరు సురేష్ కుమార్ ఫోన్ నంబర్ 94408 12387 అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా లో ఇంతవరకు సూర్యగర్ పథకం కింద 1599 కనెక్షన్స్ వేశారన్నారు. ముందుగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అడిగి న పలు సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పిజీ గుప్తా.. ఎస్. జోగినాయుడు, బీవీ రవిశంకర్, జి.లక్ష్మీ, గుడ్ల జగ్గారావు, ఆంకడాల తవిటన్న తదితరులు పాల్గొన్నారు.