వైభవంగా సత్యనారాయణస్వామి వార్షికోత్సవం
అక్షర కిరణం, (సోంపేట): సోంపేటలో ఉన్న శ్రీరమ లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ప్రథమ వార్షికోత్సవం 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలి పారు. దీనిలో భాగంగా మంగళవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, పంచగ్రవ్యపాసన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ, యాగశాల, రాజగోపురం ప్రతిష్ఠ తో పూజలు ప్రారంభించారు. గంధకి నదిలో లభ్యమయ్యే నరసింహ స్వామి వారి తొమ్మిది కిలోల సాలిగ్రామం, ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలాకి గోపాలకృష్ణస్వామి, స్వామికి సమర్పించారు. ఇతను గతంలో తిరుమల వేెంక టేశ్వర స్వామికి 108 సాలిగ్రామాల మాలను, అదేవిధంగా అయో ధ్య రాములవారికి 12 రాశులకు సంబంధించిన స్వర్ణ సాలిగ్రామ మాలను సమర్పించారు. ఈ తొమ్మిది కిలోల నరసింహ సాలిగ్రామాన్ని పురవీధుల్లో గోవింద నామస్మరణ, వేదమంత్రోచ్ఛారణలతో ఊరేగించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖ వైద్యులు, అధిక సంఖ్యలో భక్తులు తీసుకురాగా సాలిగ్రామాన్ని స్వామివారి గర్భగుడిలో రుత్వికులు ప్రతిష్ఠిం చారు. నేటి నుండి 3 రోజులపాటు ప్రతిరోజు విశేష పూజ లు, విశిష్ట హోమాలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కార్య క్రమాలు నిర్వహించను న్నారు. కార్యక్రమం చివరి రోజులో భాగంగా ఉదయం లక్ష తులసీదల అర్చన, సాయంత్రం శ్రీ స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా అక్కజోశ్యుల రమేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొమ్మిది మంది రుత్విక్కులతో, శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.