వైఎస్ జగన్‌తో సనపల రవీంద్ర భరత్ భేటీ
అక్షర కిరణం, (మాధవధార): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ కలిశారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా సనపల రవీంద్ర భరత్‌ను అభినందించారు. పార్టీ బీసీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసినట్టు సనపల రవీంద్ర భరత్ తెలిపారు.