తల్లికి వందనం.. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట
Åరాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
అక్షర కిరణం, (కోటబొమ్మాళి): రాష్ట్రంలో ఏ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడ దనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందని మంత్రి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో వరుసగా రెండో ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒక విద్యార్థికే పరిమితం చేసిన ఈ పథకాన్ని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఒక కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీ డియట్ వరకు చదువుతున్న ప్రతి అర్హ విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టు కుంటూ వరుసగా రెండో ఏడాది 67.47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుండటం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని తెలిపారు.
‘తల్లికి వందనం’ పథకం లబ్ధి పొందుతున్న తల్లులందరికీ, విద్యార్థులందరికీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులకు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, విద్యా రంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.