తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్
సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అక్షర కిరణం, (అమరావతి/తిరుమల): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమ వారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈక్రమం లోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మా సనం.. విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా..? లేదా..? అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుం డా సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.
ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు (మంగళవారం) కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తు ను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, ఈ నెల 3వ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.