ఏపీ ఆయుష్కు రూ.185.75 కోట్లు కేటాయింపు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య రంగం అభివృద్ధికి రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక (2026-27) ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని తెలి పారు. ఏపీకి కేంద్రం కేటాయించిన అత్యధిక వార్షిక కేటా యింపులు ఇవే అన్నారు మంత్రి. ఏపీ ఆయుష్కు ఈ కేంద్ర నిధులు కీలకంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో తీపికబురు చెప్పింది.. ఆయుష్ వైద్య రంగానికి సంబందించి వార్షిఖ ప్రణాళి లకకు ఆమోదం తెలిపింది. ఏపీ ఆయుష్ విభాగం వార్షిక (2026-27) ప్రణాళికకు రూ.185.75 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ చరిత్రలోనే తొలి సారిగా 2024-25 నుంచి 2026-27 వరకు కలిపి మొత్తం రూ.434 కోట్ల కేటాయింపులకు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. జాతీయ ఆయుష్ మిషన్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి లభించిన అత్యధిక వార్షిక కేటాయిం పులు ఇవేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆయుష్కు గతంలో 2014-15 నుంచి 2023-24 వరకూ పదేళ్లలో రూ.120.17 కోట్లు మాత్రమే కేటాయించ గా.. ఇప్పుడు కేవలం మూడేళ్ల కాలానికే భారీగా నిధులు మంజూరు కావడం విశేషం. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవ లను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయు ష్కు ఈనిధులు చాలా ముఖ్యమైనవని చెబుతున్నారు.
కన్వీనర్ మెడికల్ సీట్లు
రోవైపు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా ఎంబీబీఎస్/బీడీఎస్ ప్రవేశాలకు విజయ వాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ విడుదలైంది. మొత్తం 14,310 మంది అభ్యర్థులు ఉంటే.. మరో 382 మంది దరఖాస్తు ఫీజు చెల్లించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయలేదు. వీరికి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చారు అధికారులు. ఈ నెల 25న అభ్యంతరాలను ఉదయం 11 గంటల్లోగా యూనివర్శిటీకి తెలియజేయాలి అన్నారు. ఈ అభ్యంతరాల పరిశీలించిన తర్వాత ఫైనల్‌గా ప్రాధాన్య క్రమాన్ని విడుదల చేసి ఆప్షన్లు ప్రకటిస్తారు. స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని ఆయా డైరెక్టరేట్ల నుంచి వచ్చిన తర్వాత విడుదల చేస్తామంటున్నారు.
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఉద్యోగుల్ని అలర్ట్ చేసింది. సరైన కారణం లేకుండా బ్యాంకు అకౌంట్లు మార్చొద్దని సూచించారు. ఆధార్ సీడింగ్ పూర్తికాక ముందే బ్యాంకు అకౌంట్లు మార్చుకోవడంతో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం (ఏబీపీఎస్)- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)లో సాంకేతిక సమస్యలు తలెత్తి జీతాల చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నాయన్నారు.