మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
అక్షర కిరణం, (హైదరాబాద్): మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ ఈడీ కోర్టు రిమాండ్ విధించింది. కారుమూరికి రెండు వారాల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనను చంచల్ గూడా జైలుకు తరలిం చనున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును ఈడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కారుమూరికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఈడీ ఆఫీసు నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించ డంతో చంచల్ గూడా జైలుకు తరలించనున్నారు. ఏపీ మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్ కుమార్ నిందితులుగా ఉన్నారు. సునీల్ కుమార్‌ను జూన్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా మాజీ మంత్రి కారుమూరిని ఆది వారం రోజున హైదరాబాద్‌లోని ఆయన స్నేహితుడి ఇంట్లో.. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీని అడ్డు పెట్టుకుని కుంభకోణా నికి పాల్పడ్డారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ లపై కూటమి ప్రభుత్వం సిటఏర్పాటు చేసింది. దర్యాప్తులో మద్యం ధరలు ఇష్టాను సారంగా నిర్ణయించారని.. మామూళ్లు ఇచ్చినవారికే లిక్కర్ అమ్మకాలకు అవకాశం ఇచ్చారని సిట్ అధికారులు గుర్తించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు లిక్కర్ సరఫరాలోనూ అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదుచేయగా.. ఈవ్యవహారంలో నిధుల మళ్లింపు ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదుచేసింది.
దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు.. కారుమూరి సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, సందీప్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాలలో 2 రోలెక్స్ వాచీలు, రేంజి రోవర్ కారు స్వాధీనం చేసుకున్నారు. కారు మూరి సునీల్ కుమార్ ఇంట్లో మద్యం రవాణాకు సంబం ధించిన జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీని గుర్తించారు. అలాగే కారుమూరికి రూ.15 కోట్లు సొమ్ము ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 2026 జూన్ 11వ తేదీన వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిలను, జూన్ 18వ తేదీన కారుమూరి సునీల్‌కుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా జూన్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర సమయంలో హైదరాబాద్‌లో కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.