ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీ ల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమ వారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘా పనితీరును పరిశీలించిన ఆయన, 24 గంటల పోలీసు బందోబస్తు వివరాలపై ఆరా తీశారు. అనంతరం లాగ్ పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణను సరిచూసి, విధు ల్లో ఉన్న రెవెన్యూ, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేయ డంతోపాటు గోదాము భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర రావు, కలెక్టర్ కార్యాలయ సి సెక్షన్ సిబ్బంది ఉన్నారు.