అధ్వానంగా గుడ్డిభద్ర రహదారి
కగోతులు, బురదతో ప్రజల అవస్థలు
అక్షరకిరణం, (పలాస): పలాస మండలం చినంచల పంచాయతీ గోదావరి గ్రామం నుంచి మెలియాపుట్టి మండలం సంతలక్ష్మిపురం పంచాయతీ గుడ్డిభద్ర గ్రామానికి పోయే రహదారి అధ్వానంగా ఉంది. దశాబ్దాల కాలం పాటు సరైన రోడ్డు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కేవలం రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఈ రహదారి గోతులతో నిండి బురదమయంగా మారింది. అటు పలాస నియోజవర్గానికి ఇటు పాతపట్నం నియోజకవర్గానికి శివారు ప్రాంతం కావడం వల్ల ఈ రహదారిని అధికారులుగాని, ప్రజాప్రతి నిధులుగాని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిరది. సుమారు 10 గ్రామాలకు వెళ్లే ఈ రహదారి గోతులతో బురదమయంగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోనైనా రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.