హిట్ అండ్ రన్ బాధితులకు త్వరిత పరిహారం అంశంపై సమీక్ష
అక్షర కిరణం, (శ్రీకాకుళం): ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె. హరిబాబు అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని హిట్ అండ్ రన్ ప్రమాద బాధితులకు Hఱt aఅd =uఅ వీశీtశీతీ Accఱdవఅt Vఱctఱఎs ్పుశీఎజూవఅsatఱశీఅ Scష్ట్రవఎవ 2022” కింద త్వరితగతిన పరిహారం అందిం చడం, ఉచిత న్యాయ సహాయం గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి మండలంలోనూ పోలీస్ శాఖ, సంయుక్తంగా హిట్ అండ్ రన్ పరిహారం గురించి అవగాహన శిబిరాలు నిర్వహించా లని తెలిపారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు బాధితులు ఖీI=, మెడికల్ రిపోర్ట్ తో ణLSA కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా పోలీస్ అధికారులు సహాయం చేయాలని సూచించారు. రవాణా శాఖ, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ణLSA తో సమన్వయం చేసు కుని బాధితులకు వెంటనే సహాయం అందించాలని తెలి పారు. కార్యక్రమంలో కెఆర్సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. పద్మావతి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డిసిఆర్బీ పి. శ్రీనివాస రావు, రషీద్ అహ్మద్, ఎస్ రామయ్య, బి ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.