భోగాపురం విమానాశ్రయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
అక్షర కిరణం, (భోగాపురం): రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను నిర్ణీత గడువులో గా పూర్తి చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతా నికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులు సమావేశంలో వివరించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, తాగునీరు, ఇతర మౌలిక సదుపా యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమా నాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.