ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్సర’గా మారండి
Åమోదీకి అభిజిత్ దీప్కే ఘాటు విమర్శలు
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సుదీర్ఘ విద్యార్థి ఉద్యమం విజయవంతం కావడంతో.. ఢిల్లీ నుంచి సొంత ఊరికి తిరిగొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థా| Ÿకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాని మోదీపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే పీఎం పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా మారితే మంచిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ఇన్ఫ్ల్యూయెన్సింగ్ పనిని చాలా సమర్థవంతంగా చేస్తున్నారని ఎద్దేవా చేసిన దిప్కే.. ప్రధాని బాధ్యతలను నిర్వహించే అర్హత మరొకరికి ఇవ్వాలని వ్యాఖ్యానించి రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపారు.
జంతర్ మంతర్ వద్ద పెల్లెట్ల దాడిపై ఆగ్రహం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 36 రోజుల పాటు ఎండనక, వాననక కఠిన పరిస్థితుల్లోనూ పోరాటం చేసిన విద్యార్థులపై జులై 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు పెల్లెట్ తుపాకులతో దాడి చేయడాన్ని అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు. ఈ పెల్లెట్ ప్రయోగానికి ఆదేశాలు ఇచ్చిన అధికారులతో పాటు బాధ్యులైన హోంమంత్రి అమిత్ షా లేదా ఎవరైనా సరే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఛత్రపతి శంభాజీనగర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
ధర్మేంద్రప్రదాన్ రాజీనామాతో విద్యార్థుల కోపం చల్లారలేదు
ఉగ్రవాదులు కాని విద్యార్థి ఉద్యమకారుల ఇళ్లకు వివిధ రాష్ట్రాల్లో పోలీసులు వెళ్లి అరెస్టు చేస్తామని బెదిరించడం దారుణమని.. ఇలాంటి వేధింపులు తక్షణమే ఆపాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోయినంత మాత్రాన విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదని, కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ ఏకమై ప్రభుత్వాన్ని మార్చేస్తారని తీవ్రంగా హెచ్చరించారు.
చట్టాలు ఉన్నాయి.. కానీ అమలు శూన్యం!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 పై స్పందిస్తూ.. కేవలం చట్టాలు తెస్తే సరిపోదని, వాటిని అమలు చేసే వ్యక్తులు మంచివారై ఉండాలని అభిజీత్ వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. కానీ కేసు తొలి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరుకాక పోస్ట్‌పోన్ అయిందని ఆయన విమర్శించారు. విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకుంటుంటే ప్రధాన్ పార్లమెంట్లో సత్కారాలు పొందారని, అలాంటి మంత్రి దిగిపోతే విద్యార్థులు విజయోత్సవాలు చేసుకోవడంలో తప్పులేదని బీజేపీ వైఖరిని దిప్కే తీవ్రంగా నిలదీశారు.