నిబంధనలు పాటించని విద్య సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవోకు వినతి
అక్షరకిరణం, (పలాస): ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్య సంస్థలు నడిపి స్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ రవి డిమాండ్ చేశారు. ఆర్డీవో భరత్ నాయక్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జేవై స్కూల్ ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పలాస, సోంపేట, శ్రీకాకుళం కనీసం అర్హత లేని ఉపాధ్యా యులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఆటస్థలం లేకుండా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా. విచ్చలవిడి గా వేలాది రూపాయలు వివిధ కోర్స్ పేర్లు చెప్పి విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర ననుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్నారు. తక్షణమే జేవై స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించిన వారిపై చర్యలు తీసుకో కపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఆర్డీవో సానుకూలం గా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు పవన్ జస్వంత్ మనీ తదితరులు పాల్గొన్నారు.