27వ వార్డులో అక్రమ కట్టడం తొలగింపు
అక్షర కిరణం, (పలాస): ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు సోమవారం పురపాలక సంఘంలో పలు ఆక్రమణలను, అక్రమ కట్టడాలను కమిషనర్ రామారావు తనిఖీ చేశారు. 3వ వార్డు శివాజీ నగర్లో నిర్మాణమవు తున్న సిమెంట్ రోడ్డుపై పలు ఫిర్యాదులు రావడంతో ఆయన తనిఖీ చేశారు. పాత జాతీయ రహదారిని ఆనుకొని అను మతులు లేని భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. మొగిలి పాడు పంట కాలువ స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న యజమానిని పిలిపించి స్థలం డాక్యుమెంట్లు, అనుమతి పత్రాలు తేవాలని ఆదేశించారు. 27వ వార్డు రామ లక్ష్మణ కాలనీ ఉలాసపేట వీధి చివర భద్రమ్మ కోనేరు ను ఆనుకొని రానాబందలో అక్రమ కట్టడములను తొలగించారు.