28న ఇసుక కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
అక్షర కిరణం, (వన్‌టౌన్): ఇసుక కొండ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలు - విశాఖపట్నం: శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ, శుక్రవారం శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, విశేష సేవలతో పాటు భక్తులందరికీ మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా జరుపబడునని ఆయన వెల్లడిం చారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగను లాంఛనంగా చేసుకోవడానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన మీడియా ముఖంగా కోరారు.