సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవకు భక్తుల నుంచి డిమాండ్
Åఅక్టోబర్ వరకు టికెట్లు లేవు
అక్షర కిరణం, (విశాఖపట్నం): సింహాచలం అప్పన్న ఆలయా నికి కొంతకాలంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున నిర్వ హించే సుప్రభాత సేవకు ఇటీవల కాలంలో భక్తుల నుంచి డిమాండ్ పెరిగింది. ఏకంగా అక్టోబరు నెలాఖరు వరకు సుప్రభాత సేవ టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం సుప్రభాత సేవ కోసం రోజుకు 20 మందిని మాత్రమే అనుమతిస్తు న్నారు. అందుకే భక్తుల నుంచి సుప్రభాత సేవ టికెట్లకు డిమాండ్ పెరిగింది. అందుకే రాబోయే రోజుల్లో అదనంగా మరో 10 మందికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. సుప్రభాత సేవ కోసమే భక్తులు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రతిరోజూ సుప్రభాత సేవ కోసం భక్తుల్ని పరిమితంగా అను మతిస్తున్నారు. అందుకే సుప్రభాత సేవలో పాల్గొనేందుకు చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు. సుప్రభాత సేవకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా దేవస్థానం అందుబాటులో ఉంచింది. మన మిత్ర వాట్సప్ 9552300009,ష్ట్రttజూ://www.aజూtవఎజూశ్రీవs.శీతీస్త్ర వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సుప్రభాత సేవ కోసం ఒక్కొకరికి రూ.100 చెల్లించి టికెట్ తీసుకోవాలి. అక్టోబర్ నెల వరకు టికెట్లు లేవని చెబుతున్నారు.
సింహాచలం హుండీ లెక్కింపు
మరోవైపు సింహాచలం ఆలయ హుండీ కానుకల్ని లెక్కించారు. ఈవో వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించగా.. భక్తులు కానుకల రూపంలో చెల్లించిన రూ.2,11,97,273 నగదు, 12 దేశాలకు చెందిన విదేశీ నగదు, 60.100 గ్రాముల బంగారం, 5.25 కిలోల వెండి సమకూరింది. ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించిందని ఈవో తెలిపారు. కొంతకాలంగా సింహాచలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.. దీంతో స్వామివారి హుండీకి ఆదాయం పెరిగిందని చెబుతున్నారు.