నేపాల్‌లో వరదలు: 100 మందికిపైగా భారతీయులు సహా 1000 మంది టూరిస్ట్‌ల గల్లంతు
అక్షర కిరణం, (నేపాల్/జాతీయం): హిమాలయ దేశం నేపాల్‌లో మెరుపు వరదలు సంభవించాయి. భోటే కోషి నదికి ఆకస్మిక వరద పోటెత్తి నువాకోట్, ధాడింగ్ జిల్లా లను ముంచెత్తింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది చనిపోగా.. 105 మంది భారతీయులతో సహా పలువురు గల్లంతయ్యారు. నేపాల్ మీడియా నివేదికల ప్రకారం... టిబెట్ సరిహద్దువైపు వచ్చిన వరద.. భారీనష్టాన్ని కలిగించి, అనేక గ్రామాలను ఊడ్చిపెట్టింది. నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో ఇప్పటివరకు కనీసం ఎనిమిది మృతదేహాలను వెలి కితీసినట్లు కేంద్ర పోలీసు అధికార ప్రతినిధి డీఐజీ అభినరా యణ్ కఫ్లేను ఉటంకిస్తూ నేపాల్ న్యూస్ నివేదించింది.
నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతంలోని 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ లు సహా కనీసం 384 మంది గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. రసువా జిల్లాలో కనీసం 26 మంది నేపాల్ పోలీసు సిబ్బంది గల్లంతయ్యారని అధికారి పేర్కొన్నారు. సాయుధ పోలీసు దళానికి చెందిన ఏడుగురు సిబ్బంది కూడా గల్లంతయ్యా రని ఆ శాఖ పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతానికి నేపాల్ సైన్యం హెలికాప్టర్లను, విపత్తు సహాయక సిబ్బందిని మోహ రించింది. ‘నష్టం వివరాలను సేకరించే ప్రక్రియ కొనసా గుతోంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
నేపాల్ ఉత్తర జిల్లాలను బుధవారం భారీ వరద ముంచె త్తింది. వరద ధాటికి రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికా రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్ విద్యుత్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. రసువాగఢి, చిలిమే, త్రిశూలి 3దీ హబ్ 220 kV సబ్‌స్టేషన్, త్రిశూలి జలవిద్యుత్ కేంద్రం, దేవిఘాట్ జలవిద్యుత్ కేంద్రం సహా కనీసం ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో పలు జాతీయ రహదారులను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు.
భారీ విపత్తు నేపథ్యంలో జాతీయ విపత్తు ముప్పు నివారణ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులతో నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. “వైద్య బృందం, స్కౌట్స్, రెడ్ క్రాస్తో సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేం దుకు కార్యాచరణ మొదలైంది” అని షా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
వరదలకు సంబంధించిన వీడియోలను నేపాల్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లోయలోని గ్రామాలను బురద నీరు ముంచెత్తింది. నేపాల్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి నారాయణ్ కఫ్లే మాట్లాడుతూ.. ఏమేరకు నష్టం జరిగింది అనేది కచ్చితంగా తెలియదు, కానీ వరద చాలా పెద్దది, దానివల్ల అనేక నివాస ప్రాంతాలు దెబ్బతిని ఉండొచ్చు అని అన్నారు.