జగన్ తిరుమలకు వస్తే చంపేస్తారు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
అక్షర కిరణం, (హైదరాబాద్): జగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తామని హిందువులు తిరుగుతున్నారని రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు గురించి చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎవరిని కదిలించినా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన చర్చిం చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడాలని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల దేవస్థానం ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. దేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడిరచారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి కలిపారని జరుగుతున్న ప్రచారం భక్తుల మనోభావాలకు భాధ కలిగిస్తున్నాయని రాజాసింగ్ పేర్కొనడం జరిగింది. జగన్కు తిరుమల దర్శనం చేసుకునేందుకు అర్హత ఉందా..? అని ప్రశ్నించారు రాజాసింగ్. ఘోర పాపం చేశాక ధర