ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన
కపలు జిల్లాలకు రెడ్ అలర్ట్
కవిశాఖకు అరెంజ్
కవిశాఖలో కుమ్మేసిన వర్షం
అక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడిరచింది.
ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మొన్నటి వర్షాలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు చేశారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
విశాఖలో కుమ్మేసిన వర్షం
మహా విశాఖ నగరంలో ఆదివారం వర్షం కుమ్మేసింది. ఉదయం నుంచే విశాఖలో కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటికి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షంతో విశాఖలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే కాలక్షేమం చేశారు. కొండవాలు ప్రాంతవాసులు ఆదివారం కురిసిన భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయోనని భయాందోళన చెందారు. కొన్ని పల్లపు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరుకుంది.
వర్షం కారణంగా చిరు వ్యాపారులు, రోజు కూలీలు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులు గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ వ్యాపారం అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వాతావరణ శాఖ విశాఖకు అరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.