ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు
అక్షర కిరణం, (హైదరాబాద్): ఏపీని వానలు ఇంకా వీడలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలానే బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముదని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం తదుపరి కొన్ని రోజులు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు బులెటిన్లో తెలిపారు. ఇక ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ కోస్తా, ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడిరది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:
గురువారం, శుక్రవారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశ ముందని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో..
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశ ముందని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.
శుక్రవారం, శనివారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమలో..
గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశ ముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరి తల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం, శనివారాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.