ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ ఆటం బాంబ్
కబీజేపీతో కుమ్మక్కుపై పక్కా ఆధారాలతో ప్రజెంటేషన్
బిహార్ ఓట్ల జాబితా సవరణపై అనుమానం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణ
మీడియా సమావేశంలో పలు పక్కా ఆధారాలను బయటపెట్టిన రాహుల్ గాంధీ
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): బిహర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీకి లబ్ది చేకూర్చడానికే ఈసీ ఆగమేఘాలమీద ఓటర్ల జాబితాను సవరిస్తోందని ఆరోపిస్తు న్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. ఈసీ అక్రమాలకు పాల్పడిర దని పేర్కొంటూ పలు ఆధారాలను బయట పెట్టారు. ఇటీవల పలు రాష్ట్రాలు అసెంబ్లీ, గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై తాము పరిశోధన చేశామని రాహుల్ గాంధీ చెప్పారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు భిన్నమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఎన్నికలపై విశ్లేషణ, పరిశోధనలో మా అనుమానాలకు సంబంధించిన పలు ఆధారాలు బయట పడ్డాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు.
హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అంచనా లకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత ఆరోపించారు. కర్ణాటకలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, ఒక్క బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోనే 11,965 నకిలీ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలోని మహాదేవ్పురలోనూ అక్రమాలు జరిగా యని, అక్కడ 40 వేల నకిలీ ఓటర్లు ఉన్నా యని చెప్పారు. ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. సింగిల్ బెడ్రూమ్ ఇంటిలోనే 48 ఓట్లు ఉండగా.. ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు చూపించా రన్నారు. ఐదు వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందని లోక్‌సభ లో ప్రతిపక్ష నేత ఆరోపణలు చేశారు.
అడ్రస్ లేకుండానే ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల లిస్ట్‌లో పేర్లు ఉన్నాయి కానీ.. కొంతమంది ఫోటోలు సరిగా లేవని అన్నారు. ఎలక్ట్రానిక్ డేటాను కోరితే ఈసీ తమకు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈవీఎం లతో ఎన్నికల నిర్వహణపై తమకు అను మానం ఉందని పునరుద్ఘాటించారు. బిహార్‌లో లక్షల ఓట్లను తొలగించారని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేసినట్టు వివరిం చారు. ‘కర్ణాటకలో 16 పార్లమెంట్ స్థానా ల్లో కచ్చితంగా గెలుస్తామని అంచనా వేస్తే.. కాంగ్రెస్ అక్కడ 9 సీట్లలోనే గెలించింది.. బెంగళూరు సెంట్రల్ సహా 7 లోక్‌సభ సీట్ల లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాం... మహారాష్ట్రలో వయోజనుల కంటే ఓటర్లు అధికంగా నమోదయ్యారు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని అర్ధమైంది’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వారం కిందటే ఈసీపై అణుబాంబు పేల్చబోతున్నట్టు రాహుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.