డీఎస్పీగా రాఘవులు బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (విజయనగరం జిల్లా ప్రతినిధి): చీపురుపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా శ్రీ ఎస్.రాఘవులు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో ఎటు వంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా సమర్ధవంతంగా పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతీరోజూ సబ్ డివిజన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, గంజాయి నియంత్ర ణకు చర్యలు చేపట్టాలని, సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాలలో ‘సంకల్పం’తో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎస్పీ రాఘవులు సిబ్బందిని ఆదేశించారు.