కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక పంచారామ క్షేత్రదర్శిని
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఈనెల 22వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం దృష్ట్యా విశేష పర్వదినములైన సోమవారం 5 ప్రముఖ శైవక్షేత్రాలు దర్శింపచేయాలనే ఉద్దేశంతో పంచారామ క్షేత్రదర్శినిని ఏపీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతోందని రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు తెలిపారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి బయలుదేరి మరునాడు సోమవారం మొదట అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్ల కోట ఈ ఐదు శైవక్షేత్రాలను ఒకే రోజు దర్శించుకోనే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రతి శనివారం, ఈనెల 25, 26 తేదీల్లోను, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు విశాఖ ద్వారకా బస్సు స్టేషన్ నుండి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఈనెలలో ఏ రోజైనా ప్రయాణీకుల కోరిక మేరకు పంచారామాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు.
ప్రయాణఛార్జి (ఒక్కరికి): సూపర్‌లగ్జరీ రూ.2200, అల్ట్రా డీలక్స్ రూ.2150, ఇంద్ర రూ.2800లు వసూలు చేస్తున్న ట్టు తెలిపారు. టికెట్లు కావలసిన వారు ఆన్లైన్లో ష్ట్ర్‌్‌జూం://షషష.aజూంత్ీషశీఅశ్రీఱఅవ.ఱఅ/ వెబ్సైటులో విశాఖపట్నం పంచారమాలు రూట్ సెలెక్ట్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవా లని ఆర్ఎం కోరారు.
లంబసింగిటూర్: కార్తీకమాసం పిక్నిక్కు లంబసింగి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. బస్సులు శని, ఆది వారాలలో ఉదయం 3 గంటలకు ద్వారకా బస్సుస్టేషన్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మోదమాంబ గుడి(పాడేరు), కాఫీతోటలు దర్శించుకోవచ్చ న్నారు. ప్రయాణఛార్జి (ఒక్కరికి): అల్ట్రాడీలక్స్ రూ.800 ఎక్స్‌ప్రెస్ రూ.650 వసూలు చేస్తున్నట్టు వివరించారు.
ధారమట్టం: ధారమట్టం టూర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. ఈ బస్సులు శని, ఆదివారాలలో ఉదయం 7 గంటలకు ద్వారకా బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని తెలిపారు. శివాలయం, ధారమట్టం వాటర్‌ఫాల్స్, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జన్న కొండ (అనకాపల్లి) దర్శించుకోవచ్చన్నారు. ప్రయాణఛార్జి (ఒక్కరికి):): సూపర్‌లగ్జరీ రూ.650, అల్ట్రాడీలక్స్ రూ. 550 వసూలు చేస్తున్నట్టు వివరించారు. శబరిమలై కి కూడా బస్సులు నడుపుతున్నట్టు వివరించారు.
టిక్కెట్లు కావలసినవారు ఆన్లైన్లో గాని, విశాఖపట్నం ద్వారకాబస్సుస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్‌లోగాని బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్ ఫోన్లో సంప్ర దించాలని రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు కోరారు.