పలాస ఆర్డీవో భరత్ నాయక్‌కు బదిలీ
అక్షరకిరణం, (పలాస): పలాస ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్ పత్తికొండకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజమహేంద్రవరంలో టూరిజం రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వి.స్వామినాయుడు పలాస ఆర్డీఓగా రానున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలాసకు నూతనంగా ఏర్పడిన డివిజన్ కేంద్రానికి రెండవ ఆర్డీఓగా పనిచేసిన భరత్ నాయక్ పలాసలో సుమారు ఏడాది పాటు విధులు నిర్వహించారు.