అప్పన్న సన్నిధిలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకు న్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాలతో సహాయ కార్యనిర్వాహణాధికారి కె.తిరుమలే శ్వరరావు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి ఆలయంలోని మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. తదుపరి స్వామివారిని దర్శించు కున్న అనంతరం, వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వ చనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్ర మంలో మంత్రితోపాటు ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, వి.నరేంద్రవర్మ రాజు, పులపర్తి నాని, పుట్టా చైతన్య రెడ్డి, ఏపీఎంబీ చైర్మన్ డి.సత్య, మాజీ ఎమ్మెల్సీ, సీఎంసీ కోఆర్డినేటర్ రామరాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.