జర్నలిస్టు దాడికి పాల్పడిన నిందితుడుని అరెస్టు చేయాలంటూ నిరసన
అక్షర కిరణం, (విశాఖపట్నం): పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన గళమెత్తారు. జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. పి.గోవిందు పూసపాటిరేగలో భూ అక్రమాలపై వార్తలు రాయడంతో కక్ష పెంచుకున్న కబ్జాదారుడు ఈ దురాగతానికి దిగాడని ఆరోపించారు. అతను ఓ రాజకీయ పార్టీలో స్థానిక నేతగా ఉన్నాడని తక్షణమే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించా లని కోరారు. గోవిందుపై దాడికి పాల్పడినట్టు ఫొటోలు, వీడియోలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతన్ని అరెస్టు చేయలేదని విమర్శించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అని, మీడియా స్వేచ్ఛను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తక్షణ మే ఆ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్ర రావు, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.రాము, ప్రధాన కార్యదర్శి కె.చంద్రమోహన్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్య నారా యణ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజు, అనిల్, సూర్య ప్రకాష్, జగదీష్, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ సనపల నరసింహం, విశాలాంధ్ర పత్రిక బ్యూరో చీఫ్ పి.రామకృష్ణ, కె.పరశురాం, గౌతమ్, కె.నరసింహం, దేవిశ్రీ, ఆర్.అబ్బాస్, ఎర్రయ్య రెడ్డి, కిషోర్, పి.సతీష్, బీఏ .నాయుడు, శ్రీలత, ఎం.శ్రీహరి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.