తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. వేంకటాద్రి పేరుతో కొత్త యాప్..
అక్షర కిరణం, (తిరుమల): తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరిలో చాలామంది భక్తులు తిరుమలలో లొకేషన్లు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దర్శనా నికి ఎలా వెళ్లాలి, గదులు ఎక్కడ తీసుకోవడం, లాకర్లు ఎక్కడుంటాయి, తలనీలాలు ఎక్కడ సమర్పించాలి, అన్న ప్రసాద కేంద్రం ఎక్కడుంది, ఉచిత బస్సుల కోసం ఎక్కడికి వెళ్లాలి, బస్టాండ్ ఎక్కడుంది వంటి సమాచారం తెలుసు కోవాల్సి ఉంటుంది. గూగుల్‌మ్యాప్స్‌లో వెతికి వెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే టీటీడీ వినూత్న ఆలోచన చేసింది.. తిరుమలలో భక్తుల కోసం వేంకటాద్రి పేరతో యాప్‌ను తీసుకొచ్చింది. అక్టోబర్ 11న ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. శనివారం ఆవిష్కరించనుంది.
ఈ యాప్‌తో తిరుమలలోని ప్రతి లొకేషన్‌కు సులభంగా వెళ్లొచ్చు. కొండపై దాదాపు 100కుపైగా ప్రాంతాలకు భక్తులు వెళ్లేలా సహాయం అందిస్తుంది. దర్శనాల నుంచి లడ్డూ కౌంటర్ల వరకు, అన్నప్రసాదం నుంచి తాగునీగి కేంద్రాల వరకు ఇలా ఈ యాప్‌తో ఈజీగా తెలుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్‌తో మరో సౌకర్యం కూడా అందు బాటులో ఉంది.. అదే మార్క్ మై స్పాట్.. దీనితో వాహనం పార్క్ చేసిన ప్రాంతం, లేదా ఏదైనా ముఖ్యమైన ప్రాంతాన్ని స్పాట్‌లా సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఆ స్పాట్‌కు చేరుకోవచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ లేకపోయినా సరే ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ నావిగేషన్ ఫీచర్‌ను డెవలప్ చేశారు.
ఈ వేంకటాద్రి యాప్‌లో భక్తులకు 24 గంటలు సేవలు అందించేందుకు.. ఏఐ టెక్నాలజీతో గోవింద పేరుతో వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనం ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం గురించి అడిగితే బదులు వస్తుంది. అప్పుడు ఆ లొకేషన్‌కు ఈజీగా చేరుకోవచ్చు. ఒకవేళ భక్తుల దగ్గర మొబైల్ లేకపోయినా సరే ఇబ్బందిపడకుండా.. తిరుమలలోని మెయిన్ సర్కిల్స్‌లో స్మార్ట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా భక్తులు వారు వెళ్లాలనుకుంటున్న లొకేషన్ పేరు చెప్పగానే అక్కడికి వెళ్లే దారితో పాటుగా మిగిలిన వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఇలా ఈ వేంకాద్రి యాప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.