గోవా గవర్నర్గా
పూసపాటి అశోక్ గజపతి రాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం): టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హరియాణ గవర్నర్ ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్, లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తానూ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ పార్లిమెంట్కు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ కంభంపాటి హరిబాబు ఇప్పటికే ఒరిసా గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విజయనగరానికి చెందిన రాజవంశీకుడు అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించడంపై ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.