జీవీఎంసీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంశంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజ నేయులు అధ్యక్షతన కమిటీ సభ్యులు, శాసనసభ్యులు బి. రామాంజనేయులు, పి.విష్ణుకుమార్‌రాజు, శ్రీరామ్ రాజ గోపాల్, కొల్లా లలిత కుమారి, ఏజీ ఆఫీస్ నుండి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ టి. సాయికృష్ణరెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎం.విజయరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లు గురువారం విశాఖపట్నం వీఎంఆర్డీఏ కార్యాలయం సమా వేశ మందిరంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి సంబంధించిన ప్రొఫెషనల్ ట్యాక్స్ బదిలీ అంశంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక సమీక్ష చేపట్టారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఎసఎస్.వర్మ, వ్యయ పరిశీలకులు సి.వాసుదేవ రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ సత్యనారాయణ సంబంధిత అధికారులు పాల్గొని కమిటీ సభ్యులకు పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు నివేదిక రూపంలో సమర్పించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కమిటీకి పలు అంశాలను వివరించారు.
అనంతరం కమిటీకి సమర్పించిన వివరాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కమిటీ సభ్యులు పరిశీలించి సంబంధిత అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరణలు కోరారు. అధికారులు కమిటీ అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చి అవసరమైన సమాచారం జీవీఎంసీ అధికారులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందజేశారు.