మాజీ మావోయిస్టు ఆజాద్ జైలు నుంచి విడుదల
Å68 కేసులు, 15 ఏళ్ల పాటు జైలు జీవితం Åతల్లి న్యాయ పోరాటంతో విడుదల
అక్షర కిరణం, (శ్రీకాకుళం): మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలి యాస్ ఆజాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 68 కేసులు నమోదుకాగా.. దాదాపు 15 ఏళ్ల పాటూ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆజాద్ 2011లోనే పోలీసుల ఎదుట లొంగిపో యారు. కానీ 10 రోజులకే ఒడిశా పోలీసులు ఆయన్ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసు కెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై నమోదైన కేసులపై స్పెషల్ కోర్టులో విచారణ జరగ్గా.. ఆయ న్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వచ్చింది.. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.
మొత్తం 68 కేసులు, 15 ఏళ్ల జైలు జీవితం గడిపిన మాజీ మావోయిస్టు కీలక నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ విడుదలయ్యారు. తల్లి న్యాయపోరాటంతో కేశవ రావుకు జైలు జీవితం నుంచి విముక్తి దక్కింది.. ఇంటికి వెళ్లిన ఆయనకు తల్లి కాములమ్మ ఆప్యాయంగా స్వీట్లు తిని పించారు. 15 ఏళ్ల కిందట ఆయన పోలీసుల ఎదుట లోంగిపోయినా సరే కష్టాలు వెంటాడాయి. ఒడిశా పోలీ సులు ఆయన్ను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో దాదాపు 15 ఏళ్ల పాటూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. చివరికి కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరుకు చెందిన కేశవరావు చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమాలపై ఆకర్షితుడై 1990 సమయంలో పీపుల్స్ వార్ దళంలో చేరారు. ఆయన ఆజాద్ పేరుతో పీపుల్స్ వార్‌లో అగ్రనేతగా ఎదిగారు.. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఏకంగా 68 కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆజాద్‌పై 10 లక్షల రూపాయలు రివార్డు కూడా ప్రకటించారు.. 2011లో ఆయన 25 ఏళ్ల అజ్ఞాతం వీడారు.. ఆయన అప్పటి డీజీపీ అరవిందరావు సమక్షంలో లొంగిపోయారు. అనంతరం ఆయన స్వగ్రామం నల్లబొడ్లూరు వెళ్లగా.. 10 రోజుల అనంతరం ఒడిశాలో నమోదైన కేసుల్లో విచారణ పేరుతో అక్కడి పోలీసులు కేశవరావును కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను భువనేశ్వర్‌లోని జార్పడ జైలుకు తరలించారు. ఈ కేసులపై కోర్టును ఆశ్రయించారు.
ఆజాద్ పలు సంఘాల సహకారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తల్లి దున్న కాములమ్మ కూడా న్యాయపోరాటం చేశారు.. తన కుమారుడికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆజాద్‌పై ఏపీ, తెలంగాణలో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన చేపట్టాలని ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది.. ఆజాద్ జైల్లోనే నిరాహార దీక్ష కూడా చేశారు. ఒడిశాలోని పర్లాఖెముండి కోర్టు కేశవరావును నిర్దోషిగా ప్రకటించగా.. జార్పడ జైలు నుంచి విడుదలయ్యారు. సొంత ఊరు నల్లబొడ్లూరు వచ్చిన ఆజాద్‌ను చూసి కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు.. దాదాపు 15 ఏళ్ల తర్వాత కలవడంతో ఏడ్చేశారు.