డిజిటల్ సర్వే ఆర్వోఆర్, రీ సర్వే ఫైళ్లపై జేసీ సమీక్ష
అక్షర కిరణం, (శ్రీకాకుళం): రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కా రంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం జోషిలా, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎఫ్-లైన్ సర్వే, ఆరఓఆర్ రీసర్వే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేసీ, గడువులోగా అర్జీలను పరిష్కరించడంలో వెనుకబడిన మండలాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి వారి నమ్మకాన్ని పొందాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు జేసీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్-లైన్ సర్వే దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించి సరిహద్దులను వేగంగా గుర్తించాలని, క్షేత్రస్థాయి నివేదికలను ఆన్లైన్లో ఎప్పటి కప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆరఓఆర్ అర్జీలకు సంబంధించి భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, రికార్డు ల సవరణ దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరిÔ గతిన పరిష్కరించాలని, తిరస్కరించే ఫైళ్లకు స్పష్టమైన కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. రీసర్వే ప్రక్రియలో పొరపాట్లు లేకుండా సరిహద్దు రాళ్లను పక్కాగా నాటాలని, వచ్చిన అభ్యంతరాలను సకాలంలో విచారించి పరిష్కరిం చాలని ఆదేశించారు. ఫైళ్ల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్వేయర్లు, రెవెన్యూ యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపు నిచ్చారు. ఈ సమీక్షలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఎం జోషిలా, వివిధ మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.