తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ
ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులర్పించడానికి వచ్చిన కేటీఆర్‌కు గో బ్యాక్ అంటూ నిరసన
అక్షర కిరణం, (హైదరాబాద్/జాతీయం): తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్‌ను.. ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఢóల్లీి వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పించడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది.
కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయి బాబా(57) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సాయిబాబాకు గత నెల 28న ఆపరేషన్ చేసిన డాక్టర్స్.. గాల్ బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని) తొలగించి స్టంట్ వేశారు. కానీ మరో చోట చీము పట్టడంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. వైద్యులు చీమును తొలగించినప్పటికీ సాయి బాబా పరిస్థితి మరింత క్షిణించి కన్నుమూశారు. ఇదిలా ఉంటె మౌలాలిలో సాయిబాబా భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించడా నికి రాగా..ఆయనకు నిరసన సెగ ఎదురైంది. ‘గో బ్యాక్ కేటీఆర్ అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు, హక్కుల నేతలు, కార్యకర్తలను తీవ్రంగా అణచివేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఉద్యమ, హక్కుల కార్యకర్తలు.
ఉద్యమకారులు ఆగ్రహంతో.. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నా కేటీఆర్ మౌనంగా ఉన్నారు.. నివాళులు అర్పించి మౌనంగా వెనుదిరిగారు. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు కేటీఆర్. తీవ్ర అవమానం, చేదు అనుభవంతో అక్కడి నుంచి వచ్చేశారు