చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో?: ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
అక్షర కిరణం, (హైదరాబాద్): తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది. ఇంతకు ముందే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్‌పై కౌంటర్ వేసిన ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ మళ్లీ పవన్‌కు ఘాటుగా కౌంటర్ వేశారు. నటుడు కార్తీని ఉద్దేశించి పవన్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్లో లడ్డు ప్రస్తావన ఇప్పుడు వద్దు అంటూ కార్తీ మాట్లాడగా పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం, దానికి కార్తీ క్షమాపణలు చెప్పాడం తెలిసిందే. తాజాగా దానికి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. డియర్ కార్తీ గారు, మన సంప్రదాయాలపై మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ దయను, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ పెద్ద పోస్ట్ షేర్ చేశారు. ఈక్రమంలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్ అని రాసుకొచ్చారు ప్రకాష్‌రాజ్. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.