ఆ అవసరం ప్రకాశ్ రాజ్‌కు లేదు: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్షర కిరణం, (అమరావతి): లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో చేస్తున్న ట్వీట్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది’ అని పవన్ కల్యాణ్ వెల్లడిరచారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పెట్టిన ఓ పోస్ట్‌లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ‘మీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయి.. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు’ అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేయడం దుమారం రేపింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను స్పందిస్తే.. ‘దిల్లీలో మీ స్నేహితులు..’ అంటూ కామెంట్ చేయాల్సిన అవసరం ప్రకాశ్‌రాజ్‌కు లేదు. ఆయన పోస్ట్‌ను నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది’ అని చెప్పారు. ‘ప్రకాశ్‌రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా దారులు వేరైనా మా మధ్యన ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. ఆయనతో కలసి పనిచేయడం ఇష్టం’ అని కూడా పవన్ చెప్పారు.