గూగుల్ డేటా సెంటర్‌కు పోలవరం నీళ్లు..
Åవైజాగ్ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేదు Åస్పష్టత ఇచ్చిన మంత్రి నారా లోకేష్
అక్షర కిరణం, (అమరావతి): విశాఖలో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటుపై నెలకొన్న సందేహాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోంద ని, కానీ అది అవాస్తవమని ఆయన చెప్పారు. గూగుల్ డేటా సెంటర్లకు పోల వరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు వస్తోందని మంత్రి లోకేశ్ వివ రించారు. విశాఖ నగర ప్రజల నీటి అవసరా లకు కేటాయించిన నీటిని డేటా సెంటర్లకు మళ్లించడం లేదని స్పష్టం చేశారు. పోలవరం నుంచి విశాఖపట్నానికి గ్రావిటీ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నామని, 18 నెలల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలి పారు. ఇప్పటికే డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు కూ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఒక జీడబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోల్చితే డేటా సెంటర్‌కు పదో వంతు నీరే అవసరమవుతుందని.. మరి థర్మల్ పవర్ ప్లాంట్ల నీటి వినియోగంపై కాకుండా డేటా సెంటర్లపైనే ఎందుకు నిరసనలు అంటూ లోకేశ్ ప్రశ్నించారు. డేటా సెంటర్ కేటాయింపులకు 6.5 జీడబ్ల్యూ పరిమితి విధించి నట్లు సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని లోకేశ్ ప్రస్తా వించారు. 6.5 జీడబ్ల్యూ డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకే తమ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. విశాఖ వాసులు నీటి విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీకి డేటా సెంటర్లు కీలకమని చెప్పారు. గూగుల్ పెట్టుబడితో విశాఖపై ఇతర కంపెనీలకు ఆసక్తి పెరిగిందని ఆయన చెప్పారు. డేటా సెంటర్లకు సంవత్సరానికి 3 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని లోకేశ్ వివరించారు.