నెహ్రు బజార్ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
కకమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖలో పురాతనమైన నెహ్రూ బజారు శిధిలావస్థకు చేరుకుంటున్నందున, దాని అభివృద్ధికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక లను సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, 27వ వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావులతో కలసి జోన్ 3, 27వ వార్డులో నున్న నెహ్రూ బజార్ ను, డైమండ్ పార్కు ను పరిశీలించారు. నెహ్రూ బజార్లో కూరగాయలు, చాప లు, మాంసం వ్యాపారం చేస్తున్న వారితో మాట్లాడుతూ నెహ్రూ బజార్లో ఎంతమంది ఎన్నేళ్ల నుండి వ్యాపారం చేస్తు న్నారని, సరుకులు ఎక్కడినుంచి కొనుగోలు చేసి అమ్మకా నికి తెస్తున్నారని, చికెన్ వ్యర్ధాలను ఎక్కడికి తరలిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులు స్పందిస్తూ 50 సంవ త్సరాలు పైగా వారి పూర్వీకుల నుండి వంశపారపర్యంగా నెహ్రూ బజార్లో వ్యాపారం సాగిస్తున్నామని, 200 మందికి పైగా నెహ్రూ బజార్లో వ్యాపారం చేస్తున్నామని, నెహ్రూ బజార్లో మౌలిక సదుపాయాలు లేవని, పలు దుకాణాలు శిథిలావస్థకు చేరుకుని ఇబ్బందులకు గురవుతున్నామని, తెలిపారు. వాటి మరమ్మతులు చేపట్టి, మౌలిక సదుపాయా లు కల్పించాలని తాగునీరు కల్పించాలని కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అనంతరం డైమండ్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను పరిశీలించి వాటి లోపాలను సరిచేసి వాటికి పెయింటింగ్ వేయాలని సహా యక ఇంజినీర్‌ను ఆదేశించారు. పార్కులో వ్యాయామం చేస్తున్న వారు కమిషనర్‌ను, ఎమ్మెల్యేను కలసి డైమండ్ పార్క్‌కు వ్యాయామం కోసం ప్రజలు అధికంగా వస్తున్నందు న ఉన్న పరికరాలకు అదనంగా మరికొన్ని వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, పార్కు లో అందుకు తగినంత స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తామని కమిషనర్ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్, మురళీకృష్ణ, సహా యక వైద్యాధికారి బి ప్రసాద్ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.