వైభవంగా పైడితల్లమ్మ ఉత్సవాలు
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీపైడితల్లమ్మ వారి మహోత్సవాలు విజయనగరం లో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరం లోని వివిధ కళా వేధికలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు అధికారులు తెలిపారు. ఆనందగజపతి కళాక్షేత్రంలో ఈనెల 14న సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు సాంస్కృతిక, శాస్త్రీయ సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు తెలిపారు. మహారాజా కోట వద్ద సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైన్స్ ఫెయిర్, స్టాంప్స్, కాయిన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
గురజాడ కళాభారతిలో సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పౌరాణిక, సాంఘికం ఏకపాత్రాభినయాలు ప్రదర్శిస్తారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విజయనగరం ప్రముఖ వ్యక్తుల, కార్గిల్ యుద్ధ వీరుల ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. విజయనగరం గురజాడ కళాభారతిలో సోమవారం ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాంఘిక, పౌరాణిక నాటిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా హాస్య నాటికలు, కురిమెళ్ల శంకరరావు, కెరటాలు (ఈపు అప్పలస్వామి), శ్రీరామాంజనేయ యుద్దం నాటికలో రాముడిగా రెడ్డి ఆదినారాయణ, ఆంజనేయుడుగా కె.లింగరాజు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పారు. బి.లక్ష్మి ప్రధాన పాత్రధారిణిగా చింతామణి నాటకం ప్రదర్శిస్తారన్నారు.
ఎన్.సత్యారావు ప్రధాన పాత్రధారిగా సత్య హరిశ్చంద్రనాటక ప్రదర్శన ఉంటుందన్నారు.