ఏపీలో 9 లక్షల ఎకరాల ఫ్రీÓహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి
Åమంత్రి అనగాని ప్రసాద్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి నిబంధన ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సత్యప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మరో 4 లక్షల ఎకరాలకు సంబంధించి విచారణ జరుగుతోందని.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉన్న మిగిలిన భూముల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్లుగా శతాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని.. అప్పుడు లక్షలాదిమందికి ఆస్తులపై సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు.
గత ప్రభుత్వం 28 లక్షల ఎకరాలను 22-ఏలో చేర్చిందని.. ఆ భూముల్ని ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలగించామని మంత్రి సత్యప్రసాద్ గుర్తు చేశారు. 22-ఏ భూములకు సంబంధించి జీవోలు 444, 445 జారీ చేశామని.. 22-ఏ నుంచి భూముల తొలగింపు, కొత్త భూముల్ని చేర్చే అంశాలపై ఈ జీవోల ద్వారా స్పష్టత ఇచ్చామన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22-ఏలో పెడితే ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘మీ భూమి-బ్లాక్‌చెయిన’ టెక్నాలజీ ప్రాజెక్టును అమలు చేస్తూ భూమి హక్కులకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ భూమిని 22-ఏ జాబితాలో చేరిస్తే సదరు అధికారి నిరూపించాల్సి ఉంటుందన్నారు. జీవో నంబర్ 444 ప్రకారం ప్రభుత్వం ఆస్తుల్ని పరిరక్షిస్తూనే.. 22-ఏ జాబితాలో అర్హమైన భూముల్ని తొలగిస్తామన్నారు. ఈ జీవో జారీ చేసిన 2026 జులై 23 నుంచి ఆగస్టు 31 వరకు 28,790 ఎకరాలను తొలగించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో1,102 ఎకరాలను తొలగించామని.. మిగిలిన వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇంకా 20వేల ఎకరాలు పెండింగ్ ఉన్నాయి.. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ దరఖాస్తులు, ఇకపై వచ్చే దరఖాస్తుల్ని త్వరగా పరిష్కరించడంతో పాటుగా ఒకవేళ ఏవైనా దరఖాస్తుల్ని తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించేమో లిఖితపూర్వకంగా ప్రజలకు సమాధానం ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో దశాబ్దాల 22 ఏ భూ సమస్యలను పరిష్కరించామన్నారు. వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, కంగుంది, కలిదిండి, ముదినేపల్లి, మండపల్లి అంబాజీపేట గ్రామాల్లోని రైతులు, భూయజమానులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందించడం రెవెన్యూ శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు.