అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన
అక్షర కిరణం, (మాధవధార): ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు శంకుస్థాపనలు చేశారు. జీవీఎంసీ 45వ వార్డు ఏఎసఆర్ నగర్లో ఏపీ టిడ్కో గృహ సముదాయాల కోసం జిం1 సామాజిక భవనం నిర్మాణాని కి రూ.74 లక్షల జీవీఎంసీ నిధులతో శంకుస్థాపన చేశారు. అదే వార్డులో వరదనీటి కాలువ నిర్మాణానికి రూ.90.50 లక్షలతో చేపట్టనున్న పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం 47వ వార్డు బాబూజీనగర్ నుంచి అరుంధతినగర్ వరకు వరదనీటి కాలువ నిర్మాణానికి రూ.89.43 లక్షలతో, బాబూజీనగర్లో సామాజిక భవనం నిర్మాణానికి రూ.47.61 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. కప్పరాడ, సంజీవయ్యనగర్ కాలనీ ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.1.06 కోట్ల జీవీఎంసీ సాధారణ నిధులతో చేపట్టనున్న పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థలు, జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించే అవకాశం ఉండద న్నారు. శంకుస్థాపన చేసిన పనులను నిర్ణీత సమయంలో, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జీవీఎంసీ అధికారులు ఈఈ పద్మావతి, డీఈలు భరణి, ఉషారాణి, ఏఈ ఉమామహేశ్వర రావు, 47వ వార్డు మాజీ కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, పార్టీ నాయకులు పైలా ముత్యాల నాయుడు, సౌజన్య, రాజు, యాదవ్, అరుణ్ బాబు, శ్రీనుబాబు, అరుణ, మోసెస్, రాజారావు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.